![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -647 లో..... దీపకి సారె తీసుకొని కాంచన పుట్టింటి వాళ్ళు వస్తారు. కాసేపటికి దీపకి సుమిత్ర సారె పెడుతుంది. ఈ నెక్లెస్ జ్యోత్స్న నీ చేతుల మీదుగా దీప మెడలో వెయ్యి అని పారిజాతం అంటుంది. నువ్వు వెయ్యొచ్చు కదా అని జ్యోత్స్న అంటుంది. నా కోరిక వెయ్యి అని పారిజాతం అనగానే జ్యోత్స్న వేస్తుంది. ఈ నెక్లెస్ మెడలో వెయ్యగానే దీప స్థాయి మారిపోయిందని జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటారని జ్యోత్స్న అనుకొని.. ఇందాక నేను బావ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సీరియస్ డిస్కషన్ లో ఉన్నారు..బావ నా మెడలో తాళి కట్టినట్లు అత్తకి కల వచ్చిందంట అందుకే దీప నాపై అరిచిందని జ్యోత్స్న అంటుంది.
నిజమేనా కాంచన అని దశరత్ అడుగుతాడు. నిజమే అని కాంచన అంటుంది. ఇదివరకు నానమ్మ అత్తకి కలలో కన్పిస్తే దీప ప్రెగ్నెంట్ అయింది. ఇది కూడా జరుగుతుందని దీప భయం అని జ్యోత్స్న చెప్తుంది. నేను రాముడి లాంటి వాణ్ణి అని గొప్పగా చెప్పను కానీ నాకు దీప భార్యగా రావడం అదృష్టం.. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉంది.. ఈ బంధం ఎప్పటికి ఇలాగే ఉంటుందని కార్తీక్ అంటాడు. ఏం చెప్పావ్ రా మనవడా అందరికి క్లారిటీ ఇచ్చావని పారిజాతం అంటుంది. వచ్చిన పని అయింది కదా ఇక వెళదామా అని సుమిత్ర అంటుంది. నా కూతురికి సారె తీసుకొని వచ్చారు.. ఏం తినకుండానే వెళ్తారా అని కాంచన అంటుంది. అక్క టిఫిన్ కి అన్ని సిద్ధం చెయ్ అని అనసూయకి కాంచన చెప్తుంది. ఆ తర్వాత అందరికి టిఫిన్ పెడతాడు కార్తీక్.
ఆ తర్వాత దీప, కార్తీక్ ప్రేమ గా ఉండడం చూసి పారిజాతం మురిసిపోతుంది. ఎమోషనల్ అవుతుంది. ఏమైంది పారిజాతం చట్నీ కారం ఉందా అని శివన్నారాయణ అంటాడు. లేదండి ఇది మమకారం అని పారిజాతం అంటుంది. కార్తీక్ నిజంగా గ్రేట్ రా నువ్వు గొప్ప చదువు చదువుకొని, లగ్జరీ లైఫ్ వదులుకొని, ఆత్మభిమానం కోసం అన్ని వదులుకొని బయటకు వచ్చావని కార్తీక్ గురించి పారిజాతం గొప్పగా చెప్తుంది. ఆ తర్వాత జ్యోత్స్న బయటకు వెళ్తుంది. తన వెనకాలే దీప వెళ్తుంది. అత్తకి వచ్చిన కల నిజం చేస్తానని జ్యోత్స్న అంటుంది.అది నీ వల్ల కాదని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |